బాలయ్యకు సుప్రీం కోర్టు నోటీసులు..అసలు ఏమైందంటే?

హీరో బాలకృష్ణకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏమైందంటే..బాలయ్య నటించిన 100వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’. 2017లో వచ్చిన ఈ సినిమాను క్రిష్ దర్శకత్వం వహించారు. రెండో శతాబ్దానికి సంబంధించిన శాతవాహన సామ్రాజ్యాధినేత గౌతమీపుత్ర శాతకర్ణి పేరులో ఈ సినిమా తీశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక చారిత్రక సినిమా కావడంతో ఈ సినిమాకు వినోద పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు.. 

అయితే పన్ను రాయితీ తీసుకొని సినిమా టికెట్ రేట్లు తగ్గించలేదు. దీంతో సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. సినిమా యూనిట్ పన్ను రాయితీ తీసుకున్నప్పటికీ దాని ప్రతిఫలం మాత్రం ప్రేక్షకులకు దక్కేలా చేయలేదని, యధావిధిగా టికెట్ రేట్లు అమ్మకాలు జరిపారని పేర్కొన్నారు.  

దీంతో పన్ను రాయితీ పొందిన డబ్బు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి రికవరీ చేయాల్సిందిగా పిటిషన్ లో కోరారు. ఈ కేసును సుప్రీం కోర్టు న్యామూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం విచారించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సినీ నటుడు బాలకృష్ణ,  సహా సినిమా నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబా ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేసింది. 

Leave a Comment