ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్నీన్ సిగ్నల్.. ఎన్నికలు రీ షెడ్యూల్.. !

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్ లతో కూడిన ధర్మాసనం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. ఎస్ఈసీ నిర్ణయాల్లో తాము తలదూర్చలేమని స్పష్టం చేసింది. ఎన్నికల వాయిదా కుదరదలని పేర్కొంది.  

పంచాయతీ ఎన్నికల రీషెడ్యూల్..

పంచాయతీ ఎన్నికల నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేసింది. ఇందులో భాగంగా కొత్త తేదీలను ప్రకటించింది. ఈ క్రమంలో మొదటి దశ ఎన్నికలకు ఈ నెల 29 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించనున్నారు. ఇక ఫిబ్రవరి 9,13,17,21 తేదీల్లో పంచాయతీ ఎన్నిలకు పోలీంగ్ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం కానుందునే రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. 

Leave a Comment