ఆన్ లైన్ క్లాసులకు విద్యార్థి బలి.. అర్థం కాక ఆత్మహత్య..!

ఆన్ లైన్ క్లాసులకు విద్యార్థి బలి అయ్యాడు. ఆన్ లైన్ లో చెబుతున్న పాఠాలు అర్థం కాకపోవడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆలస్యంగా వెలుగు చేసింది. వివరాల మేరకు ఫెర్రీ ప్రాంతాలనికి చెందిన నడకుదిటి సత్యన్నారాయణ కుమారుడు ఎన్.దినేష్(18) గొల్లపూడిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. 

కరోనా కారణంగా కళాశాల యాజమాన్యం విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. అయితే ఈ ఆన్ లైన్ క్లాసులు దినేష్ కు అర్థం కావడం లేదు. దీంతో తోటి విద్యార్థులు దినేష్ ను చులకన భావంతో చూశారు. మనస్తాపం చెందిన దినేష్ ఈనెల 13న పురుగుల మందు తాగాడు. దీంతో దినేష్ ను మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న దినేష్ ఆరోగ్యం విషమించడంతో మరణించాడు. 

Leave a Comment