జ్వరంతో పరీక్షకు.. పరీక్ష రాస్తూ తిరిగిరాని లోకాలకు..!

తీవ్ర జ్వరం ఉన్న పరీక్ష రాయాలనుకున్నాడు. ఇంట్లో తల్లి వద్దని చెప్పినా వినలేదు. విద్యా సంవత్సరం వృధా అవుతుందని, పరీక్ష రాస్తానని పట్టుబట్టాడు. చివరికి పరీక్ష రాస్తూ మృత్యుఒడిలోకి జారుకున్నాడు. ఈ విషాద ఘటన బీహార్ రాష్ట్రం నలంద జిల్లా బిహార్ షరీఫ్ పట్టణంలో చోటుచేసుకుంది. 

బీహార్ రాష్ట్రంలో ఫిబ్రవరి 17 నుంచి పదో తరగతి బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. స్థానికంగా పదో తరగతి చదువుతున్న రోహిత్ కుమార్ అనే విద్యార్థి ఆదర్శ్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. రోహిత్ కు కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. 

జ్వరం అని తెలిసి కూడా పరీక్ష రాసేందుకు వెళ్లాడు. ఇంట్లో తల్లి వద్దని మొరపెట్టుకున్న వినలేదు. పరీక్ష రాయకపోతే ఈ విద్యా సంవత్సరం వేస్ట్ అవుతుందని నచ్చచెప్పి పరీక్ష హాలుకు వెళ్లాడు. అతడి ఉష్ణోగ్రత పరీక్షించగా అధికంగా ఉంది. దీంతో పరీక్ష రాయడానికి పాఠశాల అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా వారిని బతిమిలాడాడు. 

దీంతో ఆ విద్యార్థిని నలుగురితో కలవకుండా విడిగా కూర్చోబెట్టి పరీక్ష రాయించటానికి ఉపాధ్యాయులు అంగీకరించారు. ఈక్రమంలో ఫివ్రబరి 19న శుక్రవారం పరీక్ష రాయటానికి స్కూల్ కు వచ్చిన రోహిత్ కు పరీక్ష రాస్తుండగా మధ్యలో ఆరోగ్యం విషమించింది. దీంతో ఆ విద్యార్థి పరీక్ష హాలులోనే మరణించాడు. చేతిలో పెన్ను, పేపర్ పట్టుకుని తుదిశ్వాస విడిచాడు. పాఠశాల సిబ్బంది రోహిత్ ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. 

 

 

Leave a Comment