బైకర్ ను ఆపి పోలీస్ చేసిన పనికి ప్రశంసలు..!

సాధారణంగా పోలీసులు బైక్ ని ఆపారంటే ఇక పైన్ పడటం ఖాయం.. అన్ని కాగితాలు సరిగ్గా ఉన్నా ఏదో ఒక కారణం చూపి ఫైన్ వేస్తారు.. అయితే తమిళనాడుకు చెందిన ఈ పోలీస్ చేసిన పనికి ప్రశంసలు అందుతున్నాయి. ఎందుకంటే.. కొద్ది రోజుల క్రితం కర్ణాటకకు చెందిన అరుణ్ అనే యూట్యూబర్ బైక్ పై పాండిచ్చెరి నుంచి తెన్ కాశీకి వెళ్తున్నాడు. 

రోడ్డుపై ఆ బైకర్ ను పోలీస్ కానిస్టేబుల్ ఆపాడు.. నువ్వు కర్ణాటకకు చెందినవాడివా అని అడిగాడు. దానికి ఆ బైకర్ అవును అన్నాడు. ఒక గవర్నమెంట్ బస్సును చూపిస్తూ..ఇలాంటి బస్ ఒకటి వెళ్తోంది. అందులో ఓ అమ్మ మందు మరిచిపోయింది. ఆమెకు ఈ మందు ఇవ్వు..అంటూ మందు బాటిల్ ఇచ్చాడు. బైకర్ సరే అంటూ ఆ మందు బాటిల్ తీసుకున్నాడు. బైక్ పై వేగంగా వెళ్లి ఆ బస్సును ఆపాడు. బైకర్ ఆ మందు బాటిల్ ను వృద్దురాలికి ఇచ్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘మీరిద్దరూ మానవత్వానికి న్యాయం చేశారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment