రామతీర్థం అనుమతించకపోతే రాష్ట్ర తగలబడిపోతుంది : విష్టు వర్ధన్ రెడ్డి

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్టు వర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలను రామతీర్థం అనుమతించకపోతే రాష్ట్రం తగలబడిపోతుందని, జరగబోయే పరిణామాలకు సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాలని హెచ్చరించారు. రామతీర్థం కొండ మీదికి టీడీపీ, వైసీపీని అనుమతించి మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులు వైసీపీ కండువాలు కప్పుకుని డ్యూటీ చేయాలని చెప్పారు.

 పోలీసులకు జీతాలు ఇస్తోంది వైసీపీ ఆఫీసా.. లేక రాష్ట్ర ప్రభుత్వమా అని ప్రశ్నించారు. ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘనపై పోలీసుల దమన కాండపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నామన్నారు. 60 ఏళ్ల వయస్సున్న సోము వీర్రాజుని అరెస్ట్ చేయడం జగన్ పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. ఏపీలో పోలీసుల ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం వల్లనే వరుస సంఘటనలు జరుగుతున్నాయన్నారు. పోలీసులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని విష్టువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. 

Leave a Comment