‘పవర్ స్టార్’ ఫస్ట్ లుక్ ఫోటోలు రిలీజ్..ఓ లుక్కేయండి..!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.  ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా కూడా ఆయన ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల చేయనున్నారు. ఇక ఆయన ట్విట్టర్ ద్వారా ‘పవర్ స్టార్’ కు సంబంధించిన ఫొటోలను పోస్టు చేశారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. 

ఇక ఆయన చేస్తున్న ఈ సినిమాలోని క్యారెక్టర్ అచ్చం  పవన్ కళ్యాన్ ని పోలి ఉండటం గమనార్హం. దీన్ని బట్టి ఆయన పవన్ కళ్యాన్ మీద సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన విడుదల చేసిన ఫొటోలో మెగాస్టార్ చిరంజీవిని పోలి ఉండే పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం తాను ఎవరిని ఉద్దేశించి సినిమా తీయట్లేదని చెబుతున్నాడు. ఇక సినిమా ఎన్ని వివాదాలు సృష్టించాలో అని పలువురు చర్చించుకుంటున్నారు. 

 

Leave a Comment