ఈసారి మంచు లక్ష్మిన టార్గెట్.. దారుణంగా మాట్లాడిన శ్రీరెడ్డి..!

శ్రీరెడ్డి.. నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉండే నటి.. తన గురించి ఎవరైనా మాట్లాడితే చాలు బూతులతో విరుచుకుపడుతుంది. తాజాగా శ్రీరెడ్డి మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మిని టార్గెట్ చేస్తూ ఓ స్ఫూఫ్ వీడియో చేసింది. ఆ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ మంచు లక్ష్మిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. 

హాయ్.. ఎవరని చూస్తున్నారా.. నాపేరు మంచు లక్ష్మి.. అంటూ వీడియో మొదలు పెట్టింది. మంచు లక్ష్మి కూతుర్తెను ఉద్దేశించి కూడా అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఇది నా డాటర్.. రీసెంట్ గా పుట్టింది.. అంటే నాకు పుట్టింది కానీ.. నాకు పుట్టలేదు..అంటూ చెప్పింది. ఇంకా ఈ వీడియోలో డాడీ అంటే నాకు రెస్పెక్ట్ ఉండదు.. కానీ మీడియా ముందు వాళ్ల పేర్లు చెప్పుకుంటేనే మా బతుకు.. అందుకే కేవలం మీడియా ముందు మాత్రమే డాడీ గురించి మాట్లాడుతా.. అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా ప్రస్తావిస్తూ పికుల్ ప్రీత్ సింగ్ అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. నాకు పెళ్లి అయినా అవనట్లే.. పిల్లలు ఉన్నా లేనట్టే ఎందుకంటే నేను కనలేదు.. బట్ నావే విత్తనాలన్నీ అంటూ చెప్పుకొచ్చింది. దాదాపు 11 నిమిషాల పాటు వీడియో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి, మంచు లక్ష్మిని ఇమిటేట్ చేస్తూ అనేక విషయాలను దారుణంగా ట్రోల్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   వీడియో కోసం కింది లింక్ క్లిక్ చేయండి…

https://www.facebook.com/watch/?v=185191900101785

Leave a Comment