పవన్ పై శ్రీరెడ్డి హాట్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చికిత్స తీసుకుంటున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది.. దీనిపై వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేసి హాట్ టాపిక్ గా మారారు. 

తాజాగా నటి శ్రీరెడ్డి పవన్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ‘నాపేరు శ్రీరెడ్డి.. నాకు ఓ డ్రామా కంపెనీ ఉంది. ఆ డ్రామా కంపెనీలో బండ ఎద్దుల గణేష్, పవన్ ఇద్దరూ పనిచేస్తారు.. అందులో బండ ఎద్దుల గణేష్ కు మొదట కరోనా జ్వరం వచ్చింది. ఆ తర్వాత వాడు పవన్ కి అంటించాడు. ఇప్పుడు ఆ ఇద్దరు కనిపించకుండాపోయారు. ఆ ఇద్దరు ఎక్కడ ఉన్న పట్టుకు వచ్చి మా డ్రామా కంపెనీకి అప్పగిస్తారని కోరుకుంటున్నాను.ఆ ఇద్దరు కనిపించట్లేదని తొందరలో ప్యాంట్ కూడా వేసుకోవడం మర్చిపోయాను’ అంటూ హాట్ కామెంట్ చేసింది..

ఇక పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా.. సోషల్ మీడియాలో శ్రీరెడ్డిని ఓ ఆట ఆడుకున్నారు. కరోనాతో బాధపడుతున్న పవన్ పై ఈ సమయంలో ఇలాంటి కామెంట్స్ ఏంటని మండిపడుతున్నారు. నువ్వసలు ఆడదానివేనా అంటూ మెసేజ్ లు చేస్తున్నారు. మరికొంతమంది నువ్వు ప్యాంట్ వేసుకుంటే ఏంటీ వేసుకోకపోతే ఏంటి అని సెటైర్లు వేస్తున్నారు. పవన్ కరోనాతో బాధపడుతుంటే ఈ సమయంలో శ్రీరెడ్డి ఇలాంటి వీడియో పోస్ట్ చేయడం పట్ల చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  

 

Leave a Comment