అవసరాల శ్రీనివాస్ గుట్టు రట్టు చేసిన కో డైరెక్టర్..!

నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ పేరు అందరికి తెలిసిందే.. అష్టాచెమ్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు  పరిచయమయ్యాడు. ప్రస్తుతం అవసరాలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అవసరాల శ్రీనివాస్ అసలు రూపం బయటపడింది. ఇందులో అవసరాల శ్రీనివాస్ లుక్ అందరినీ షాక్ కు గురిచేసింది. 

మూడేళ్లుగా అతని దగ్గర కో డైరెక్టర్ గా పనిచేస్తున్న మహేష్ అనే వ్యక్తిని కారణం లేకుండా తిట్టి ఆఫీస్ నుంచి బయటకు పంపించేశాడు.. దీంతో అవసరాల నిజస్వరూపం చూపిస్తా అంటూ.. అవసరాల శ్రీనివాస్ ఫొటోషూట్ చేస్తుండగా అతని దగ్గరకు వెళ్లి అతని తలపై ఉన్న క్యాప్ ని తీసేసాడు.. ఇంకేముంది, క్యాప్ తీయగానే అవసరాల బట్టతలతో కనిపించారు. 

దీంతో మండిపోయిన అవసరాల శ్రీనివాస్ ‘ఈ వీడియోను బయటకు తీసకెళ్తే.. నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇది ఒక ప్రాంక్ వీడియో అని కొందరు చెబుతున్నారు. ఇది ఏదో సినిమా ప్రమోషన్ కోసం చేసి ఉంటారని మరికొందరు అంటున్నారు.  

Leave a Comment