ఎస్పీ బాలు ఆరోగ్యం అత్యంత విషమం..

గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంపై చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు బులిటెన్ లో తెలిపారు. దీంతో బాలు కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుంటున్నారు. 

ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్ రావడంతో ఆగస్టు 5 నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. అయితే మళ్లీ ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన అభిమానుల్లో ఆందోళన చెందుతున్నారు. బాలు త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 

Leave a Comment