గాన గంధర్వుడు ఎస్పీ బాలు కన్నమూత..!

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) కన్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాసతీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆయన శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కరోనాతో ఆగస్టు 4న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్ ధ్రువీకరించారు. 

కరోనా నుంచి కోలుకున్నా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా బాలు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. నిపుణులైన వైద్యులు ఆయనకు చికిత్స అందించినా ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. 50 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న ఆయన మరణంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. 

Leave a Comment