సోనూసూద్ మరో సాయానికి రెడీ.. చిన్నారి గుండె ఆపరేషన్ చేయిస్తానని హామీ..

సోనూసూద్ పేదల పాలిట ప్రత్యక్ష దైవంగా మారాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది వలస కూలీల బాధలన తీర్చాడు. తర్వాత కూడా ఎంతో మంది పేదలకు ఆసరాగా ఉంటుంన్నాడు. తాజాగా సోనూసూద్ మరో సాయానికి ముందుకు వచ్చాడు. ఓ వ్యక్తి తన కూతురు గుండె ఆపరేషన్ కోసం సహాయం కోరగా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. 

ఆసిఫ్ అనే వ్యక్తి ట్విట్టర్ లో సోనూసూద్ కు తన సమస్యను వివరిస్తూ పోస్ట్ చేశాడు. ‘సర్ నాకు నాలుగు నెలల పాప ఉంది. నా సమస్యను మీతో పంచుకుంటున్నాను. నా చిన్నపాప గుండె జబ్బుతో బాధపడుతోంది. గెండుకు రెండు రంధ్రాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. గుండెకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. నేను ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నాను. దయ చేసి సహాయం చేయండి’ అంటూ కోరాడు. ఈ పోస్టుకు స్పందించిన సోనూసూద్ ‘ఆసిఫ్ భాయ్..వచ్చే వారం ముంబైలో శస్త్ర చికిత్స చేయిద్దాం. లిటిల్ ఏంజిల్ ను సూపర్ ఫిట్ గా మార్చేద్దాం. మీ ప్రయాణ వివరాలకు సంబంధించి మా టీమ్ మిమ్మల్ని సంప్రదిస్తుంది. త్వరలో కలుద్దాం’ అంటూ రీట్విట్ చేశారు. 

Leave a Comment