సోనూసూద్ కు అరుదైన గౌరవం.. స్పైస్ జెట్ విమానంపై సోనూ ఫొటో..!

కరోనా లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులను ఆదుకున్న సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నారు. లాక్ డౌన్ లో ఎంతో మందిని తమ సొంత గ్రామాలకు పంపించాడు. అంతే కాదు సాయం కోరిన ప్రతి ఒక్కరికీ ఆపన్నహస్తం అందించారు. దీంతో సోనూసూద్ కు సోషల్ మీడియాలో హీరో అయ్యాడు. 

ఈ రియల్ హీరోకి స్పైస్ జెట్ విమానయాన సంస్థ తనదైన రీతిలో అరుదైన గౌరవాన్ని కల్పించింది. లాక్ డౌన్ లో అందించిన సహాయ సహకారాలకు గౌరవంగా తమ స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానంపై సోనూ సూద్ ఫొటోను వేసింది. అంతేకాకుండా ‘అపద్బాంధవుడు సోనూ సూద్ కు సెల్యూట్’ అని విమానంపై రాపింది. ఓ దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఓ వ్యక్తికి ఇలా గౌరవం ఇవ్వడం ఇదే తొలిసారి.. అందరి ప్రేమకు ధన్యవాదాలు అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు. 

Leave a Comment