సోనూ సూద్ మరో సాయం.. IAS ప్రిపేర్ అయ్యే వారికి స్కాలర్ షిప్స్..!

సోనూసూద్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తన తల్లి సరోజ్ సూద్ 13వ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం ఐఏఎస్ అభ్యర్థులకు స్కాలర్ షిప్ లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని సోనూ సూద్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తన తల్లి పేరు మీద పేదరికంలో ఉండి ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. స్కాలర్ షిప్ ల కోసం www.scholifyme.com సైట్ లో అప్లయి చేసుకోవాలని సూచించాడు. 

కాగా, అక్టోబర్ 13న సోనూసూద్ తల్లి సరోజ్ సూద్ వర్థంతి.. ‘పదమూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున, అక్టోబర్ 13.. నా చేతుల్లో నుంచి జీవితం చేజారిన వేళ. అమ్మ’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి సరోజ్ సూద్ ను గుర్తు చేసుకుంటూ ఆమెకు నివాళులర్పించారు.  ఆమెను ఎంతగానో మిస్సవుతున్నట్లు పేర్కొన్నారు. 

Leave a Comment