కార్మికులకు 100 స్మార్ట్ ఫోన్లు గిఫ్ట్ ఇచ్చిన రియల్ హీరో..!

కరోనా లాక్ డౌన్ నుంచి తన సేవా కార్యక్రమాలను సోనూసూద్ కొనసాగిస్తునే ఉన్నారు. తన దాతృత్వంతో అందనంత ఎత్తు ఎదిగిన సోనూసూద్ మరోసారి రియల్ హీరోగా నిలిచారు. తాజాగా తను నటిస్తున్న ఆచార్య సినిమా యూనిట్ సభ్యుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. 

ఈ సినిమాకు పని చేస్తున్న పేద కళాకారులు, టెక్నీషియన్లకు 100 మొబైల్ ఫోన్లు కానుకగా ఇచ్చారు. సోనూ సూద్ నుంచి మొబైల్ ఫోన్లు అందుకున్న ఆ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సెట్ లో సందడి వాతావరణం నెలకొంది. కాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ సినిమాలో సోనూ సూద్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.   

Leave a Comment