మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్..!

కరోనా లాక్ డౌన్ లో ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. మొదటి వేవ్ లో వలస కార్మికులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారి సొంతూళ్లకు పంపించారు. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ఆ తర్వాత ఎంతో మందికి ఆర్థిక సాయం చేశారు. దీంతో ప్రజలు ఆయన్ను దేవుడిలా భావిస్తున్నారు. కొన్నిచోట్ల గుడి కట్టి పూజలు చేశారు..  కరోనా సమయంలో స్టార్ట్ చేసిన సేవాకార్యక్రమాలు నేటికి కొనసాగిస్తూ వస్తున్నాడు.

తాజాగా తన సొంత ఊరు అయిన పంజాబ్ లోని మోగాలో ‘మోగాకి బేటి’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ఆడపిల్లలకు సైకిళ్లు పంపిణీ చేశారు. దాదాపు 40 గ్రామాల్లోని ఆడపిల్లలకు 1000 సైకిళ్లను తన చెల్లెలు మాళవికతో కలిసి అందజేశారు. గ్రామాల్లోని ఆడపిల్లలు స్కూలుకు నడుచుకుంటూ వెళ్లడాన్ని గమనించిన సోనూసూద్.. 8వ తరగతి నుంచి ఇంటర్ చదివే ఆడపిల్లలకు సైకిళ్లను అందించారు. 

Leave a Comment