పుట్టిన రోజున 3 లక్షల ఉద్యోగాల ప్రకటించిన సోనూసూద్..!

సినిమాల్లో విలనే అయినా రియల్ లైఫ్ లో రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. కష్టం ఉందని తెలిస్తే చాలు వాలిపోతున్నాడు. కష్టాల్లో ఉన్న వారిని తనకు తోచిన సాయాన్ని చేస్తున్నాడు.  తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించాడు. కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు 3 లక్షల ఉద్యోగాలను కానుకగా ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘ నా పుట్టిన రోజు సందర్భంగా ప్రవాస సోదరులకు pravasirojgar.com లో 3 లక్షల ఉద్యోగాల ఒప్పందం కుదుర్చుకున్నాను. మంచి వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ మరియు ఇతరు సదుపాయలు ఉంటాయి’ అంటూ ట్వీట్ చేశాడు. 

Leave a Comment