‘బీజేపీని గెలిపిస్తే రూ.75 లకే చీప్ లిక్కర్ ఇస్తాం’.. వైరల్ అవుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు..!

విజయవాడలో బీజేపీ జనాగ్రహ సభలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు దేశమంతా వైరల్ అవుతున్నాయి. ‘వైసీపీ హయాంలో ప్రభుత్వమే పచ్చిసారా కాస్తూ.. రూ.3ల మద్యాన్ని రూ.25లకు కొని రూ.250కి విక్రయిస్తున్నారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ పేరుతో చెత్త బ్రాండ్లను తీసుకొచ్చి అమ్ముతున్నారు. బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తే రూ.75 లకే చీప్ లిక్కర్ ఇస్తాం.. ఆదాయం బాగుంటే రూ.50కే ఇస్తాం’ అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.  

ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో దేశమంతా వైరల్ అవుతోంది. వివిధ భాషల్లోకి ట్రాన్స్ లేషన్స్ అయ్యి మరీ మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇక సోమువీర్రాజు వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. ‘వాహ్.. ఏం స్కీం ఇది.. ఎంత అవమానకరం.. బీజేపీ జాతీయ విధానాన్ని ఏపీ బీజేపీ ఎంత దిగాజార్జిందో చూడండి. చీప్ లిక్కర్ ను రూ.50కే ఇస్తారట.. బీజేపీకి వ్యతిరేకత అధికంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఇవ్వాలా?’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

Leave a Comment