ల్యాప్ టాప్ పేలి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మృతి..!

కడప జిల్లా బి.కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామంలో ఇటీవల ల్యాప్ టాప్ పేలి తీవ్రంగా గాయపడిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సుమలత(22) తిరుపతిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. వర్క్ ఫ్రం హోమ్ లో సుమలత ఇంటి దగ్గర పనిచేసుకుంటుంది. ఈనెల 18న ఇంట్లో తన మంచంపై ల్యాప్ లాప్ కి ఛార్జింగ్ పెట్టి పని చేస్తుండగా అది పేలి మంటలు అంటుకున్నాయి. 

ఈ ఘటనలో సుమలత తీవ్రంగా గాయపడింది. దీంతో చికిత్స నిమిత్తం ఆమెను తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మంచం మీద కూర్చొని ఒడిలో ల్యాప్ టాప్ పెట్టుకుని పనిచేస్తుండగా పేలుడు సంభవించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.  బెంగళూరు కేంద్రంగా పనిచేసే మ్యాజిక్ సొల్యూషన్స్ లో సుమలత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. సుమలత ఉద్యోగంలో చేరి మూడు నెలలే అయ్యింది..

Leave a Comment