సామాజిక దూరం పాటించాలి : సీఎం జగన్

అమరావతి : ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని సీఎం జగన్ కోరారు. బుధవారం లాక్ డౌన్ పై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిత్యావసరాల కోసం ప్రజలు ఒకే సమయంలో పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారని, దీని వల్ల కోవిడ్ నివారణకు సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశం దెబ్బతింటోందని సమావేశంలో చర్చించారు. ప్రజల్లో నిత్యావసరాలు దొరకడంలేదనే ఆందోళన లేకుండా చేయడానికి, అదే సమయంలో సామాజిక దూరం పాటించేలా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై చర్చలు జరిపారు. 

అధిక ధరలకు విక్రయిస్తే 1902 కు కాల్ చేయండి..

కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఎవరైనా ఎక్కువ ధరలకు విక్రయిస్తే 1902 కాల్ సెంటర్ కు కాల్ చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. కాల్ సెంటర్ లో ఒక సీనియర్ అధికారిని పెట్టాలన్నారు. ఫిర్యదాలు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తీసుకున్న కఠిన చర్యలను కూడా పబ్లిసైజ్ చేయాలన్నారు. నిర్వ చేయలేని పంటల ఉత్పత్తుల విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 

144 సెక్షన్ అమలు..

నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 144 సెక్షన్‌ రోజంతా అమల్లో ఉంటుందన్నారు. నలుగురికి  మించి ఎవ్వరూ కూడా ఎక్కడా గుమి కూడరాదన్నారు. 

సమావేశంలో నిర్ణయాలు

  • నగరాలు, పట్టణాల్లో రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలి. 
  • ఒకేచోట కాకుండా నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలి. 
  • ఈ దుకాణాలు నిర్ణీత దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. 
  • అలాగే ప్రతి దుకాణం వద్ద సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేయాలి. 
  • నిత్యావసరాల దుకాణాల వద్ద కూడా ప్రజలు దూరం దూరంగా నిలబడేలా మార్కిగ్‌ చేయాలి. 
  • కూరగాయలు, నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు వీలైనంత త్వరగా తీసుకోవాలి.
  • అంత వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ అనుమతించాలి. 
  • ప్రజలు నిత్యావసరాలకోసమే బయటకు రావాలి
  • ఎవ్వరూ కూడా 2–3 కి.మీ పరిధి దాటిరాకూడదు
  • ఆమేరకు నిత్యావసరాలు వారికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి
  • పాలు లాంటి నిత్యావసరాలను వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలి.
  • ప్రజలకు నిత్యావసరాలు అందించడంలో కీలక పాత్ర పోసిస్తున్న హమాలీలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలి. 
  • కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లను కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా టీవీలు, పేపర్లలో ప్రకటించాలి.

 

Leave a Comment