హోటల్ లో పరోటా ఆర్డర్.. పార్శిల్ లో పాము చర్మం.. కస్టమర్ షాక్..!

ఈరోజుల్లో తీరక లేక చాటా మంది హోటల్ ఫుడ్ పై ఆధారపడుతున్నారు. కానీ హోటళ్లలో ఫుడ్ నాణ్యత లేకపోతే మాత్రం ఆరోగ్య సమస్యలు తెేచ్చుకోవాల్సిందే.. ఒక్కోసారి ప్రాణాలే పోయే ప్రమాదం కూడా ఉంది. తాజాగా కేరళలో ఓ హోటల్ నిర్లక్ష్యం బయటి ఆహారం తినే వారికి షాక్ కి గురిచేసింది. ఇంకెప్పుడు హోటల్ ఫుడ్ ఆర్డర్ చేసి తినడానికి భయపడేలా చేసింది.

కేరళలోని తిరువనంతపురంలో నెదుమంగడ్ ప్రాంతంలో ఉన్న హోటల్ లో ప్రియా అనే మహిళ రెండు పరోటాలు ఆర్డర్ చేసింది. ఇంటికెళ్లి ఆ పార్శిల్ తెరిచి చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ కి గురైంది. పార్శిల్ లో పరోటాలతో పాటు పాము చర్మం కనిపించింది. దీంతో ఆమె ఆగ్రహం చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఆ తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు హోటల్ తీరుపై ఫిర్యాదు చేసింది. దీంతో సంబంధిత అధికారులు హోటల్ లో తనిఖీ చేశారు. సదరు రెస్టారెంట్ ఆహారాన్ని ప్యాకింగ్ చేసిన పేపర్ పై పాము చర్మం ఉన్నట్లు తేలిందని ఫుడ్ సేఫ్టీ అధికారి అర్షిత బషీర్ తెలిపారు. హోటల్ లో పరిశుభ్రత సరిగ్గా లేదని, వంట గదిలో తగినంత వెలుతురు కూడా లేదని అన్నారు. పరిశుభ్రత పాటించని హోటల్ ను మూసివేసి, లైసెన్స్ రద్దు చేశారు. దీంతో పాటు రెస్టారెంట్ యజమానికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు.  

  

 

 

 

Leave a Comment