వామ్మో.. కూల్ డ్రింక్ లో పాము పిల్ల..!

ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలకు దాహార్తి తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే జర జాగ్రత్త.. ఇటీవల కూల్ డ్రింక్స్ బాలిట్స్ లో వివిధ రకాల పురుగులు, చిన్న సైజు జంతువుల అవశేశాలు కనబడుతున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో థంప్స్ అప్ బాటిల్ లో పాము ప్రత్యక్షమైంది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం పేరూరు వై-జంక్షన్ లోని ఓ బేకరిలో కూల్ డ్రింక్ బాటిల్ లో మూడు అంగుళాల పాము దర్శనమిచ్చింది. 

 కూల్ డ్రింక్ లో పాము పిల్లను చూసిన షాపు నిర్వాహకులు షాకయ్యారు. వెంటనే కూల్ డ్రింక్స్ సప్లయర్స్ కు స్టాక్ వెనక్కి పంపించారు. పాము ఉన్న కూల్ డ్రింక్ వీడియోను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్ గా మారింది. గతంలోనూ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూడా కూల్ డ్రింక్ బాటిల్ లో పాము కనిపించింది.  

Leave a Comment