నాగుపామును చూస్తే చాలు హార్ట్ బీట్ పెరిగిపోతుంది. కానీ పాములు పట్టేవారు మాత్రం అంతగా భయపడరు. అది నాగుపాము అయినా.. మరేదైనా పాము కావచ్చు.. చాలా రిలాక్స్ గా పాములను పట్టుకుంటారు. పామును పట్టిన తర్వాత వాటితో ఆడుకుంటుంటారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఓ వ్యక్తి నాగుపామును పట్టుకున్న తర్వాత దానిని ముద్దాడేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ పాము మాత్రం అతడి పెదవిపై కాటు వేసింది.
శివమొగ్గ జిల్లా భద్రావతి బొమ్మనకట్టేలోని ఓ ప్రాంతంలో నాగుపాము కనిపించడంతో స్థానికులు పాముల్ని పట్టే ఓ వ్యక్తికి సమాచారం అందించారు. ఆ వ్యక్తి వచ్చి ఆ నాగుపామును ఒడిసి పట్టుకున్నాడు. అయితే ఆ సమయంలో అందరూ వీడియో తీస్తున్నారు. దీంతో ఆ వ్యక్తి కొంత అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆ పాము తల మీద ముద్దు పెట్టబోయాడు.
అంతే ఆ పాము రివర్స్ తిరిగి అతడి మూతిపై కాటేసింది. దీంతో అతడు పామును వదిలేశాడు. మరో వ్యక్తి ఆ పామును పట్టే ప్రయత్రం చేయగా.. అది అక్కడి నుంచి పారిపోయింది. పాము కాటేసిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ వ్యక్తికి పాము లిప్ లాక్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A reptile expert who went to kiss a cobra and got bitten on the lip..
He tried to kiss the snake after rescuing it.
#Kiss #Cobra #CobraBite #Viral pic.twitter.com/Khbfc2vK3W— AH Siddiqui (@anwar0262) October 1, 2022