పెళ్లయిన 16 ఏళ్లకు పుట్టాడు.. చనిపోయిందనుకున్న పాము కాటేయడంతో..!

చనిపోయిందనుకున్న పాము ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది.. పెళ్లయి 16 ఏళ్లకు పుట్టిన కొడుకును కాటేసింది. దీంతో ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గాంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైరెడ్డి సంతోష్, అర్చన దంపతులకు 17 ఏళ్ల క్రితం పెళ్లయింది. 

పెళ్లయి 16 ఏళ్ల తర్వాత వీరికి నైతిక్(2) పుట్టాడు. ఇన్నేళ్లకు బాబు పుట్టడంతో కంటికిరెప్పలా చూసుకుంటున్నారు. సంతోష్ ఇంటి ఆవరణలో గురువారం మధ్యాహ్నం రక్తపింజర పాము ప్రవేశించింది. దానిని గుర్తించిన స్థానికులు కర్రతో ఆ పామును కొట్టారు. చనిపోయిందనుకుని కర్రతో బయటకు విసిరేశారు. 

ఆ పాము నైతిక్ పక్కన పడింది. చనిపోయిందనుకున్న పాము హఠాత్తుగా పైకిలేచి బాలుడి కాలిపై కాటేసింది. దీంతో ఆ బాలుడ్ని వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ కి తరలించారు. అప్పటికే విషం శరీరం అంతా పాకవడంతో వైద్యులు చికిత్స అందిస్తుండగా బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.     

Leave a Comment