దేశ రాజధాని ఢిల్లీలో ఆరు రోజులు సంపూర్ణ లాక్ డౌన్..!

దేశవ్యాప్తంగా కరోనా విలయం సృష్టిస్తోంది. ఈనేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ లాక్ డౌన్ ప్రకటించారు. ఆరు రోజుల పాటు కఠిన రీతిలో లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. 

ఢిల్లీలో కరోనా వేగంగా విస్తరిస్తోందని, కరోనా కట్టడికి ఏప్రిల్ 26వ తేదీ వరకు లాక్ డన్ ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో మహమ్మారిని ఎదుర్కొంటామని, లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం రాదని భావిస్తున్నామని ఢిల్లీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టమైన లాక్ డౌన్ తప్పదని, కానీ వలస కార్మికులు ఇక్కడే ఉండాలని సూచించారు. ఇది చిన్న లాక్ డౌన్ మాత్రమేనని, ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వలస కార్మికులను ఆదుకుంటుందని కోరారు. 

అయితే అవసరమైన సేవలు, ఆహార సేవలు, వైద్య సేవలు కొనసాగుతాయని వెల్లడించారు. కేవలం 50 మందితో వివాహాలు జరపవచ్చన్నారు. అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఇందు కోసం విడిగా పాస్ లు జారీ చేయబడతాయని, త్వరలో వివరాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. 

Leave a Comment