మాబిడ్డ ప్రాణాలు నిలబెట్టండయ్యా.. బాలుడికి దెబ్బతిన్న ఊపిరితిత్తులు..!

ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండల మూలగుంటపాడు గ్రామానికి చెందిన చిట్టిబోయిన హేమంత్ శంకర్ 7వ తరగతి చదువుతున్నాడు. ఆరోగ్యం బాగా లేక ఆస్పత్రికి వెళ్తే గుండె పగిలిపోయే వార్త చెప్పారు వైద్యులు.. గ్రామానికి చెందిన చిట్టిబోయిన శివ, శివకుమారీల కుమారుడు హేమంత్ కి ఈనెల మొదటి వారంలో జ్వరం వచ్చింది. చుట్టుపక్కల ఆస్పత్రుల్లో చూపించారు. అయినప్పటికీ జ్వరం తగ్గలేదు. 

దీంతో గుంటూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడికి ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇక్కడ వైద్యం చేయడం కుదరదని వైద్యులు చెప్పారు. దీంతో గ్రామానికి తిరిగి వచ్చిన సమస్యను కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వివరించారు. తర్వాత వైద్యం కోసం హైదరాబాద్ యశోదా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హేమంత్ వైద్యానికి రూ.40 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్లు తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ప్రైవేట్ పాఠశాలలో టీచర్లుగా చేసే తమకు అంత ఖర్చు చేసి వైద్యం చేయించే స్తోమత లేదని వారు వాపోతున్నారు.

ఫొటో: షాపుల వద్ద విరాళాలు సేకరిస్తున్న విద్యార్థులు

ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ప్రయత్నాలు చేస్తూనే దాతల సహకారం కోరుతున్నారు. హేమంత్ వైద్యం కోసం ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో చాలా మంది స్పందిస్తున్నారు. వీరితో పాటు యువనేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో, శింగరాయకొండ మండలంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు విరాళాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి తమ కొడుకును కాపాడాలని హేమంత్ తల్లిదండ్రులు కోరుతున్నారు. దాతలు సహాయం చేయాల్సిన వారు సీహెచ్.శివప్రసాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శింగరాయకొండ, అకౌంట్ నెంబర్ 20158572796, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0012922.. గూగుల్ పే, ఫోన్ పే నెంబర్లు 9948300494లకు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

 

  

Leave a Comment