మగవారికి అలెర్ట్.. పచ్చళ్లు ఎక్కువగా తింటే ఆ సామర్థ్యం తగ్గుతుందట..!

వేడి వేడి అన్నంలో పచ్చళ్లతో పాటు మరి కాస్త నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుంది కదూ.. అయితే ఈ పచ్చళ్లు లిమిట్ గానే తీసుకోవాలి. బాగున్నాయి కదా అని ఎక్కువగా తింటే మాత్రం హానికరమేనట.. ముఖ్యంగా పురుషులు ఊరగాయలు, చట్నీలు, పచ్చిమిర్చి, కారం ఎక్కువగా తింటే.. పలు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చట్నీలు తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పురుషుల్లో సంతానోత్పత్తిపై ప్రభావం

మార్కెట్ లలో దొరికే పచ్చళ్లలో వాడే మసాలా దినుసులు ఎక్కువగా ఉడకవు.. అలాగే దాని తయారీలో నూనె ఎక్కువగా వాడతారు.. మామిడి పచ్చడిలో అస్టామిప్రిడ్ అనే మూలకం ఉంటుంది. ఇది పురుషుల లైంగిక ఆరోగ్యంపై చెబు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇందులో ఉండే ప్రిజర్వేటివ్ లు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయి. పురుషుల్లో సంతానోత్పత్తి బలహీనం అవుతుంది. దీని వల్ల వీర్య కణాల సంఖ్య, వీర్యం నాణ్యత కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల పురుషులు ఈ పచ్చళ్లను వీలైనంత తక్కువగా తినాలి.

గ్యాస్ట్రిక్ క్యాన్సర్

పలు అధ్యయనాల ప్రకారం ఊరగాయలను ఎక్కువగా తినే వారిలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. అందులో ఉంటే అధిక ఉప్పు వల్ల రక్తపోటు రోగులకు, గుండె సమస్యలు ఉన్న వారికి చాలా ప్రమాదకరమట.. 

కొలెస్ట్రాల్ ప్రమాదం

ఇంట్లో తయారు చేసిన ఊరగాయలను పరిమిత పరిమాణంలో తినాలి. మార్కెట్లో దొరిక ఊరగాయల్లో రుచిగా ఉండటానికి ఎక్కువ నూనె, మసాలాలను ఉపయోగిస్తారు. అందువల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. 

నోట్: ఈ కంటెంట్ లో ఇచ్చిన అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏదైన సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి..  

   

 

Leave a Comment