ఎండలకు తట్టుకోలేక.. ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నారా?..అయితే సమస్యలు తెచ్చుకుంటున్నట్లే..!

Fridge Water: ఎండకాలం ప్రారంభమైంది. ఎండలు కూడా మండి పోతున్నాయి..డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవాలంటే తగినన్ని నీరు తాగాల్సిందే.. ఎండ వేడికి తట్టుకోలేక చాలా మంది ఫ్రిడ్జ్ లోని కూల్ వాటర్ తాగుతుంటారు.. కానీ ఈ నీళ్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తాగినప్పుడు బాగానే ఉంటుంది. చల్లని నీటితో హాయిగా అనిపిస్తుంది. అయితే కూల్ వాటర్ తో దాహం తీరదు.. పైగా ఈ నీరు శరీరంలో వేడిని చేస్తుంది.. ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం.. 

కడుపు నొప్పి:

ఫ్రిడ్జ్‌లోని కూల్ వాటర్ తాగడం వల్ల కడుపు నొప్పి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి, సాధారణ ఉష్ణోగ్రత వద్ద, పెద్ద ప్రేగు కదలికలు జరుగుతాయి. చల్లటి నీటిని తాగితే, దాని కదలిక దెబ్బతింటుంది. దీని వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయి. జీర్ణ సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.

శరీర వ్యవస్థ క్షీణిస్తుంది:

కడుపులో జీర్ణక్రియ కోసం ఏర్పడిన ఆమ్లం సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఏర్పడుతుంది. కూల వాటర్ దీనిని ప్రభావితం చేస్తుంది. దీంతో మలబద్ధక సమస్యలు తెలత్తుతాయి. దీని వల్ల శరీర వ్యవస్థ మొత్తం పాడైపోయి అనేక ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

జలుబు లేదా దగ్గు కూడా రావచ్చు:

చల్లని నీరు తాగడం వల్ల జలుబు లేదా దగ్గు కూడా వస్తుంది. శీతాకాలంలో వేడి నీరు ఆరోగ్యానికి హానికరం, అదే విధంగా వేసవిలో చల్లని నీరు కూడా హానికరం. ఉష్ణోగ్రతలో వ్యత్యాసం గొంతు నొప్పికి కారణమవుతుంది. ఇది టాన్సిల్స్ కి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

చల్లని నీరు గొంతుకు విషం:

వేసవిలో ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని నీరు గొంతుకు విషం లాంటిదని నిపుణులు అంటున్నారు.. చల్లటి నీరు తాగాలనుకుంటే కుండలో నీరు సురక్షితం అని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద చల్లబడుతుంది. అదే సమయంలో, దాని మట్టి కంటెంట్ కారణంగా, నీటి రుచి కూడా బాగుంటుంది. కుండలో నీరు త్రాగడం వల్ల మీ గొంతుకు హాని కలగదు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

బ్రెయిన్ పై ఎఫెక్ట్:

కూల్ వాటర్ ఎక్కువ తాగితే తలనొప్పి, సైనస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే చల్లని నీళ్లు తాగినప్పుడు బ్రెయిన్ ఫ్రీజ్అవుతుంది. అంటే కొన్ని సెకన్లపాటు నరాలు చల్లబి జివ్వుని నొప్పి పుడుతుంది. ఇలా జరిగితే బ్రెయిన్ పై ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. 

గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థలను కంట్రోల్ చేసే వాగస్ నాడీ శరీరంలో మెడ దగ్గర ఉంటుంది. చల్లని నీరు తాగడం వల్ల నాడీ వ్యవస్థ చల్లబడి హార్ట్ రేట్,పల్స్ రేట్ తగ్గి, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. 

 

Leave a Comment