సిద్ధార్థ రెడ్డి VS ఎమ్మెల్యే

నందికొట్కూరు వైసీపీలో ఆధిపత్య పోరు

ఎమ్మెల్యే ఆర్థర్ రాజీనామాకు సిద్ధం..

కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీలో ఆధిపత్య పోరు పెరిగిపోయింది. ఈ పోరు నామినేటెడ్ పదవుల విషయంతో మరింత రచ్చకెక్కింది. నందికొట్కూరు  మార్కెట్ యార్డ్ చైర్మన్ నియామకంలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పై చేయి సాధించారు. ఆయన సూచించిన చిన్న మల్లారెడ్డిని చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో సిద్ధార్థ రెడ్డి వర్గీయులు సంబురాలు చేసుకున్నారు. మరో వైపు ఎమ్మెల్యే ఆర్థర్ ప్రతిపాదించిన గుండ్రెడ్డి ప్రతాపరెడ్డికి పదవి దక్కలేదు. దీంతో ఎమ్మెల్యే ఆర్థర్ తీవ్ర అసంత్రుప్తితో ఉన్నారు. తాను ప్రతిపాదించిన వ్యక్తికి పదవి రాకపోవడంతో ఆయన రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

అసెంబ్లీ ఎన్నికల్లో నిందికొట్కూరులో వైసీపీ విజయం సాధించింది. గత ఎమ్మెల్యే ఐజయ్యకు సీటు దక్కకపోవడంతో ఎన్నికల ముందు ఆర్థర్ పార్టీలో చేరారు. ఆర్థర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన విజయానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎంతో సహకారం అందించారు. ఆర్థర్ కంటే చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనే వారు. దీంతో నందికొట్కూరులో ఆయనకున్న క్రేజ్ తో ఆర్థర్ ఎన్నికల్లో విజయం సాధించారు. 

ఎన్నికల తర్వాత కొన్ని నెలలు బాగానే ఉన్నా..తరువాత వీరద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది.

 నియోజకవర్గంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎంట్రీతో పరిస్థితులు తారుమారవుతున్నాయి. పేరు ఆర్థర్ ఎమ్మెల్యే అయినా అక్కడ పెత్తనం మొత్తం సిద్ధార్థ రెడ్డిదే..దీంతో యుతనేత మరియు ఆర్థర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అభిమానులు, అనుచరులు విడిపోయారు. అలా మొదలైన వర్గపోరు ఆర్థర్ రాజీనామా దాకా వెళ్లింది. ఆర్థర్ వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థర్ ఇలా తన అసంతృప్తిని వెల్లగక్కడం గమనార్హం. మరోవైపు.. ఎన్నికల్లో తేడాలొస్తే పదవులు ఊడతాయ్ అని సీఎం జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

Leave a Comment