షాకింగ్..ఏసీలో 40 పాము పిల్లలు

ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ జిల్లాలో భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంట్లో ఏకంగా 40 పాము పిల్లలు బయటపడ్డాయి. ఈ ఘటన జిల్లాలోని పావ్లీ ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. 

పావ్లీ ఖుర్ద్ గ్రామానికి చెందిన శ్రద్ధానంద్ అనే రైతు సోమవారం రాత్రి తన ఇంట్లో ముందు నేలమీద ఒక పాము పిల్లను చూశాడు. వెంటనే దాన్ని పట్టుకుని బటయ పారేశాడు.  కొద్ది సేపటి తరువాత, నిద్రపోయేందుకు తన బెడ్ రూంకు వెళ్లాడు. ఇంకేముంది..బెడ్ మీద ఇంకో మూడు పాము పిల్లలు కనిపించాయి. దీంతో ఆ రైతులో ఆందోళన నెలకొంది. ఈ పాము పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నాయి..అని ఆలోచిస్తున్నాడు..అంతలోపే ఏసీలో నుంచి మరో పాము పిల్ల బయటపడింది. 

ఇక ఆ రైతు ఏసీని నిశితంగా పరిశీలించాడు. ఇంకేముంది. గుట్టలుగుట్టలుగా పాము పిల్లలు ఉన్నాయి. ఏసీ పైపులో 40 పాము పిల్లలను చూసి ఆ రైతు షాక్ కు గురయ్యాడు. ఇక ఈ వార్త గ్రామంలో వ్యాపించడంతో గ్రామస్థులు శ్రద్ధానంద్ ఇంటి వద్ద గుమిగూడారు. వారి సహాయంతో ఆ పాము పిల్లలను పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలారు. 

ఎయిర్ కండీషనర్లను ఎక్కువ రోజులు వాడకుండా వదిలేయడం, లేక సర్వీసింగ్ చేయించకపోవడం వల్ల పాములు గుడ్లు పెట్టి ఉండవచ్చని, ఆ గుడ్ల నుంచి పిల్లలు ఇప్పుడు బయటకు వచ్చాాయని స్థానిక వెటర్నరీ డాక్టర్ వత్సల్ అభిప్రాయపడ్డారు. 

 

Leave a Comment