షాక్ : శవం నుంచి సౌండ్స్..!

కేరళలో ఆశ్చర్యపరిచే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణించాడు. మరణం వార్త తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ప్రాంతాలన్ని పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్ ను పిలిపించారు. ఫొటో గ్రాఫర్ అక్కడకు చేరుకుని శవాన్ని ఫొటోలు తీయడం ప్రారంభించాడు. శవంపై ఉన్న గాయల ఫొటోలు తీస్తూ శవం దగ్గరకు వెళ్లాడు. అంతే ఒక్కసారిగా శవం నుంచి ఏవో శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఎవరో మూలుగుతున్నట్లుగా సౌండ్ వినిపించింది. దీంతో ఆ ఫొటో గ్రాఫర్ కు భయం మొదలైంది. అక్కడి నుంచి పరుగులు పెట్టాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. 

వివరాల్లోకి వెళ్తే..కేరళలోని ఎర్నాకుళంలో సదాశివం అనే వ్యక్తి అనుమానస్పదస్థితిలో మరణించాడు. తలపైను  ఎవరో కొట్టినట్లు గాయాలు ఉన్నాయి. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పరిశీలించి పొటోలు తీసేందుకు టామీ థామస్ అనే ఫొటోగ్రాఫర్ ను పిలిపించారు. ఫొటోలు తీస్తున్న క్రమంలో శవం నుంచి మూలుగుతున్న సౌండ్ వినిపించాయి. దీంతో భయపడిపోయిన థామస్ పోలీసులకు చెప్పాడు. 

వెళ్లి చూస్తే అక్కడ సదాశివం చనిపోలేదు. బతికే ఉన్నాడు. పోలీసులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సదాశివం పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. సదాశివంకు తలకు గాయమవడంతో స్పృహతప్పి కింద పడిపోయాడు. దీంతో అతడు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు భావించారు. అయితే గాయం ఎలా అయిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

 

Leave a Comment