ఆయేషాకు విడాకులు ఇచ్చిన శిఖర్ ధావన్.. ఈ ఆయేషా ఎవరూ..?

51
Shikhar Dhawan Divorce

సెలబ్రెటీల విషయంలో విడాకులు, పెళ్లిళ్లు కామన్ అయిపోయింది. తాజాగా టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్నారు. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోవాల్సి వచ్చింది. వీరిద్దరికి 2012లో పెళ్లయింది. జొరావర్ అనే 7 ఏళ్ల కొడుకు ఉన్నాడు.

 విడాకుల విషయాన్ని ఆయేషా ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. రెండో సారి విడాకులు తీసుకోవాల్సి రావడంపై ఆమే ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తొమ్మిదేళ్లు కలిసి ఉన్న తర్వాత అయేషా ఈ నిర్ణయం తీసుకోవడం అందర్నీ షాక్ కు గురి చేసింది. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో, దీనికి కారణం ఏమిటో అర్థం కావడం లేదు. అయితే గత ఏడాది నుంచే వీరి మధ్య కొన్ని గొడవలు జరుగుతున్నాయని, అంతేకాకుండా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని తెలిసింది.  

ఆయేషా ముఖర్జీ ఎవరూ?

ఆయేషా ముఖర్జీ కుటుంబ సభ్యులు పశ్చిమ బెంగాల్ కి చెందినవారు. ఆయేషాకు 8 ఏళ్లు ఉన్నప్పుడు వారు ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో సెటిల్ అయ్యారు. ఆయేషాకు కిక్ బాక్సింగ్ లో ప్రావీణ్యం ఉంది. ఇందులో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. గతంలో ఆయేషా ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అతడితో కలిసి వైవాహిక బంధానికి గుర్తుగా ఆమె ఇద్దరు బిడ్డలకు తల్లి అయింది. ఆ తర్వాత ఆయేషా అతడితో విడాకులు తీసుకుంది. 

శిఖర్ ధావన్ తో పెళ్లి..

శిఖర్ ధావన్ కు ఆయేషా ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆయేషా శిఖర్ ధావన్ కంటే 10 ఏళ్లు పెద్దది.. దీంత శిఖర్ ధావన్ ఇంట్లో పెళ్లికి ఒప్పుకోలేదు. శిఖర్ ధావన్ తన తల్లి అంగీకారంతో 2009లో ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. 2012లో ఆయేషాను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిద్దరి బాధ్యతను కూడా శిఖర్ ధావనే తీసుకున్నాడు. శిఖర్ ధావన్, ఆయేషాలకు ఓ కొడుకు ఉన్నాడు..

 

 

 

  

 

View this post on Instagram

 

A post shared by Aesha Mukerji (@apwithaesha)

Previous articleసలసల కాగే నీటిలో బాలుడు.. వైరల్ వీడియో..!
Next articleవినాయక చవితి ఉత్సవాలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here