వీడియో వైరల్ : అందరి ముందే అండర్ వేర్ తీసి మాస్కుగా పెట్టుకుంది..!

అప్పుడప్పుడు బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ మర్చిపోవడం మామూలే.. అయితే కొన్ని సూపర్ మార్కెట్లలో మాస్క్ లేనిదే లోనికి అనుమతివ్వరు. అలా మాస్క్ లేకుండా మార్కెట్ కు వెళ్లిన ఓ మహిళను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. దీంతో ఆ మహిళ అందరి ముందే తన అండర్ వేర్ ను తీసి ముఖానికి పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.  

దక్షిణాఫ్రికాలోని ఒక సూపర్ మార్కెట్ కు ఓ మహిళ సరుకులు తీసుకునేందుకు వెళ్లింది. అక్కడ సరుకులు తీసుకొని బిల్లింగ్ కోసం క్యూలో నిలబడింది. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న సెక్యురిటీ సిబ్బంది మాస్క్ ఏదని అడిగారు. వెంటనే ఆ మహిళ తన అండర్ వేర్ ను తీసి ముక్కుకు మాస్క్ గా పెట్టుకుంది. ఆ మహిళ చర్యకు అక్కడివారంతా షాక్ కు గురయ్యారు.  

Leave a Comment