నవ్వుతూ వీడియో తీసి.. నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది..

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సాబర్మతీ నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు ఓ ఎమోషనల్ వీడియో రికార్డు చేసింది. ఆ వీడియో నవ్వుతూ పలు విషయాలను పంచుకుంది. కుటుంబ సభ్యులకు సందేశం ఇచ్చింది. చివరికి ఓ సాబర్మతీ నది తల్లీ.. నీ ఒడిలోకి నన్ను చేర్చుకోవా.. నన్ను నీలో కలిపేసుకోవా.. అంటూ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. 

ఆహ్మదాబాద్ కు చెందిన అయేషా ఆరిఫ్ ఖాన్ అనే మహిళ భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. సాబర్మతి నది వంతెనపై కూర్చొని కుటుంబ సభ్యులకు పంపేందుకు ఓ వీడియోను రికార్డ్ చేసింది. ఆ వీడియో ఆమె ఏం చెప్పిందంటే..‘ హలో నాపేరు అయేషా ఆరిఫ్ ఖాన్.. ఏం చెప్పను.. దేవుడు ఇచ్చిన జీవితం ఇంతే అనుకోండి.. నాన్నా.. మీరింకా ఎన్ని రోజులు ఫైట్ చేస్తారు. అయేషా కొట్లాటల కోసం పుట్టలేదు. ఆరిఫ్ ను ప్రేమించాను.. 

ఆయను ఇబ్బంది పెట్టకండి.. నిజంగా ఆయనుకు స్వేచ్ఛ కావాల్సి వస్తే.. అలాగే ఉండొచ్చు. నా జీవితం ఇంతే.. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేను అల్లాను కలుసుకుంటాను. నాలో లోపం ఏంటో అల్లాకే చెప్తాను. మంచి తల్లిదండ్రులు దొరికారు. మంచి స్నేహితులు దొరికారు. నాలో ఏదో లోపం ఉంది.. మనుషుల రూపాలను మళ్లీ చూపించొద్దని అల్లాను ప్రార్థిస్తాను. అల్విదా’ అంటూ నవ్వుతూ చెప్పింది. అనంతరం తన జీవితాన్ని ముగించుకుంది. 

రాజస్తాన్ లోని జాలోర్ కు చెందిన ఆరిఫ్ ఖాన్ తో 2018లో అయేషాకు పెళ్లి జరిగింది. తర్వాత అయేషాను వేధించడం మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడి కట్నంగా డబ్బులు కూడా ఇచ్చారు. అయినా వేధింపులు తగ్గలేదు. లక్షన్నర ఇవ్వాలని అయేషా తండ్రిని ఆరిఫ్ ఖాన్ డిమాండ్ చేశారు. 2019లో భార్యను పుట్టింట్లోనే వదిలేసి వెళ్లిపోయాడు. 

అప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తన వద్దకు రాకుండా ఏదైన నదిలో దూకి చావాలని అయేషాను భర్త ఆరిఫ్ చెప్పాడు. దీంతో భర్త చెప్పినట్లుగానే అయేషా సామర్మతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఆమె నవ్వుతూ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆత్మహత్యకు పురుగొల్పిన భర్తను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని మానవ హక్కుల సంఘాలు గుజరాత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.  

 

Leave a Comment