అన్నతో విబేధాలపై షర్మిల క్లారిటీ ఇచ్చిందా?.. ఒంటరినయ్యానని భావోద్వేగ ట్వీట్..!

గత కొంత కాలంగా ఏపీ సీఎం జగన్ కు, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు మధ్య విబేధాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. దీంతో వీరిద్దరూ వ్యక్తిగతంగానూ కలవకుండా దూరంగానే ఉంటున్నారు. జూలై 8న వైఎస్సార్ జయంతి రోజున షర్మిల, జగన్ ఒకరికొకరు ఎదురుపడకుండానే నివాళులర్పించారు. అంతేకాదు రాఖీ పండుగ రోజున కూడా అన్నా, చెల్లి ఇద్దరూ కలవలేదు. అయితే అలాంటిది ఏమీ లేదని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. 

 నేడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా షర్మిల, జగన్ ఇద్దరు నివాళులర్పించడానికి వచ్చారు. ఇడుపులపాయలో కుటుంబ సభ్యులంతా కలిసి వైఎస్సార్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్న చెల్లి ఇద్దరూ పకపక్కనే ఉన్నారు. కానీ తండ్రి సమాధి వద్ద ఇద్దరూ పక్కపక్కనే ఉన్నా కనీసం పలకరించుకోలేదు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో తండ్రి వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ షర్మిల చేసిన భావోద్వేగ ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

షర్మిల చేసిన ట్వీట్ ఇదే..

‘ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలెదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్ అండ్ మిస్ యు డాడ్’ అంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు షర్మిల.. ఈ ట్వీట్ రూపంలో తన మనసులో బాధను షర్మిల చెప్పారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Leave a Comment