తెలంగాణలో షర్మిలా కొత్త పార్టీ?

తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుపై షర్మిలా సంకేతాలు ఇచ్చారు. మంగళవారం లోటస్ పాండ్ లోని తన కార్యాలయంలో నల్గొండ జిల్లా నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. తన అన్న జగన్ ఏపీలో ఆయన పని చేసుకుంటున్నారని, తెలంగాణలో తన పని తాపే చేసుకుంటానని పేర్కొన్నారు. 

తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని, త్వరలో రాజన్న రాజ్యం రాబోతోందని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాదు, అన్ని జిల్లాల నేతలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. అందరితో మాట్లాడిన తరువాతనే అన్ని విషయాలు వెల్లడిస్తామని తెలిపారు. 

Leave a Comment