విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడి అత్యాచారం..!

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రధానోపాధ్యాయుడు కామంతో కళ్లు మూసుకుపోయి అత్యంత నీచమైన పనికి ఒడిగడ్డాడు. విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేటలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల మేరకు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిని(15) 9వ తరగతి చదువుతోంది. ఈనెల 22న స్కూల్ కి వెళ్లిన విద్యార్థినిని మాస్క్ పెట్టుకోలేదని తన గదిలోకి రావాలని హెచ్ఎం ఆదేశించాడు. గదిలోకి వెళ్లిన విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. దీంతో ఆ బాలిక భయపడి తన తల్లికి కూడా జరిగిన విషయం చెప్పలేదు. అదే పాఠశాలలో గతంలో పనిచేసిన ప్రధానోపాధ్యాయురాలు బుధవారం కలిసిన సందర్భంలో ఆ విద్యార్థిని జరిగిన విషయాన్ని ఆమెతో చెప్పింది. ఆ ప్రధానోపాధ్యాయురాలు ఆమెకు ధైర్యం చెప్పింది. దీంతో విద్యార్థిని, తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

ఈ ఘటనపై ఆ ప్రధానోపాధ్యయుడికి దేహశుద్ధీ చేయాల్సింది పోయి.. అతనికి మద్దతుగా ఓ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామని రాజీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ విషయం తెలిసి మరో పార్టీ నేతలు బాలికకు మద్దతుగా నిలవడంతో ఆమె తల్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు హెచ్ఎంపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Leave a Comment