అందంగా ఉందని ఉద్యోగం నుంచి తీసేశారు..!

ఏదైన కంపెనీలో ఎవరైనా అమ్మాయి అందంగా ఉంటే ఏంచేస్తారు.. ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేసి ప్రోత్సహిస్తారు. మరి కొన్ని కంపెనీల్లో అయితే అందమైన అమ్మాయిలను కస్టమర్లతో మాట్లాయిస్తూ ఉంటారు. కానీ రొమేనియాలో విచిత్ర సంఘటన జరిగింది. ఓ యువతి అందంగా ఉందని ఆమెను ఉద్యోగం నుంచి తీసేశారు. 

రొమేనియాకు చెందిన 27 ఏళ్ల క్లాడియా ఆర్డిలియన్ అందగత్తే. ఎన్నో బ్యూటీ కాంటెస్టుల్లో విజేతగా నిలిచింది. అంతే కాదు, న్యాయశాస్త్రం, యూరోపియన్ నీతి శాస్త్రంలో క్లాడియా డ్యూయల్ డిగ్రీ పట్టా పొందింది. దీంతో ఆమెను రొమేనియన్ న్యుమోనియా క్లినికల్ హాస్పిటల్ బోర్డులో అప్రెంషియేటర్ గా చేరింది.

కొత్తగా ఉద్యోగంలో చేరానన్న ఆనందంలో డ్యూటీకి హాజరైన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆమెకు ఎలాంటి అర్హత లేకపోయిన కేవలం అందంగా ఉన్నందుకు ఉద్యోగం ఇచ్చారని విమర్శించారు. 

ఈ విమర్శల నేపథ్యంలో క్లూజ్ సిటీ కౌన్సిల్ తన నిర్ణయాన్ని మార్చుకుంది. క్లాడియాను వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆదేశించింది.  దీంతో తాను బలవంతంగా ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చిందని క్లాడియా పేర్కొంది. ఈ నిర్ణయాన్ని చూసి ఆశ్చర్యపోయానంటూ బిజినెస్ మ్యాగజైన్ లో క్లాడియా అన్నారు. 

తన నియమాకాన్ని సమర్థించడానికి అవసరమైన నైపుణ్యాలు, విద్యార్హతలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. కేవలం తాను అందంగా ఉండటం వల్లే ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పింది. అయితే క్లాడియాను ఉద్యోగం నుంచి తప్పించినందుకు తాను బాధపడ్డానని క్లూజ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అలిన్ టైస్ పేర్కొన్నారు. ఆమె నియామకం మీద ఎలాంటి నింద పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  

 

Leave a Comment