సీరియల్ నటి లహరి అరెస్ట్..!

తెలుగు సీరియళ్లలో ప్రధాన పాత్రల్లో నటించిన లహరి అరెస్ట్ అయింది. శంషాబాద్ నుంచి వస్తున్న లహరి ఎదురుగా వస్తున్న ఒక ద్విచక్రవాహనాన్ని ఢికొట్టింది. ఈప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో లహరి కారు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నట్లు తెలిసింది. అంతేకాదు ఆ వ్యక్తి రక్తమోడుతున్నా కూడా లహరి కారు లోంచి దిగలేదు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లహరిని కారుతో సహా శంషాబాద్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన సమయంలో లహరి మద్యం సేవించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి విధులు ముగించుకుని శంషాబాద్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు గాయపడ్డ వారి నుంచి ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.  

Leave a Comment