వీరు మంచి మనుసు.. 51 వేల మందికి అన్నదానం..!

కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరగడంతో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో దేశవ్యాప్తంగా చాలా మంది పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ క్రికటర్ వీరెంద్ర సెహ్వాగ్ మంచి మనుసు చాటుకున్నాడు. ఆకలితో అలమటిస్తున్న రోగుల ఆకలి తీరుస్తున్నాడు. 

లాక్ డౌన్ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 51 వేల మందికి భోజనం పంపిణీ చేశాడు. ఢిల్లీలో కరోనా బారిన పడి, ఆహారం కావాలంటే ట్విట్టర్ ద్వారా డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరాడు. సెహ్వాగ్ అందించే పార్సిళ్లలో చపాతీ, అన్నం, ఓ ఫ్రై, పప్పు, టమాట రైస్ లాంటివి ఉన్నారు. సెహ్వాగ్ ఫౌండేషన్ తరఫున తాను ఈ కార్యక్రాన్ని చేపట్టినట్లు వీరు వివరించాడు. 

Leave a Comment