ఉక్రెయిన్ లో రష్యా దాడులు కొనసాగుతుండటంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. యుద్ధం సమయంలో ఎటు నుంచి ఏ బాంబు వచ్చి పడుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎంతో మంది ఉక్రెయిన్ విడిచి వెళ్తున్నారు. ఇందుకు స్టార్ హీరోలు సైతం అతీతులు కారు.. ఉక్రెయిన్ లో రష్యా చేస్తున్న దాడిని డాక్యుమెంటరీగా తీయాలని వెళ్లిన ఓ హాలీవుడ్ స్టార్ కి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే వేలాది మంది శరణార్థుల్లాగా ఆయన కూడా కాలినడకన దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది.
ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై ఓ డాక్యుమెంటరీ తీసేందుకు హాలీవుడ నటుడు, దర్శకుడు సీన్ పెన్ ఇటీవల కీవ్ వెళ్లారు. గత గురువారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మీడియా సమావేశానికి వెళ్లి కొన్ని వీడియోలు సైతం రికార్డు చేశాడు. అయితే ఏం జరిగిందో తెలీదు కానీ.. పెన్ ఉక్రెయిన్ నుంచి కాలినడక వెళ్లాల్సి వచ్చింది.
ఈ విషయాన్ని పెన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భూజానికి బ్యాగ్ వేసుకుని.. చేేతిలో మరో ట్రాలీ బ్యాగుతో నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోను షేర్ చేశాడు. తమ కారును రోడ్డు పక్కనే వదిలేసి.. తాను, తన ఇద్దరు సహచరులు మైళ్ల దూరం నడుచుకుంటూ పోలాండ్ బోర్డర్ కి చేరుకున్నామని తెలిపాడు. అయితే తన కారును వదిలి నడుచుకుంటూ ఎందుకెళ్లాల్సి వచ్చిందో సీన్ పెన్ వెల్లడించలేదు. ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయటపడినట్లు ఆయన అధికార ప్రతినిధి చెప్పారు.
Myself & two colleagues walked miles to the Polish border after abandoning our car on the side of the road. Almost all the cars in this photo carry women & children only, most without any sign of luggage, and a car their only possession of value. pic.twitter.com/XSwCDgYVSH
— Sean Penn (@SeanPenn) February 28, 2022