చిప్స్ ప్యాకెట్ చోరీ చేసిన పక్షి.. ఎలాగో వీడియో చూడండి..!

పాపం ఎంత ఆకలి వేసిందో ఆ  పక్షికి.. ఓ సూపర్ మర్కెట్ లో చిప్స్ ప్యాకెట్ చోరీ చేసింది. సీగన్ అనే పక్షి సామాన్యంగా సముద్రాలు, నదుల నీటిపైనే ఎక్కువగా తిరుగుతాయి. అలాంటి ఈ పక్షి స్కాట్లాండ్, అబెర్దీన్ లోని సూపర్ మార్కెట్ వద్దకు వచ్చి వాలింది. కాసేపు అటు ఇటు చేసి ఆ సూపర్ మార్కెట్ లో ప్రవేశించింది.

అక్కడ ఎన్నో రకాల చిప్స్ ప్యాకెట్లను చూసి ఓ ప్యాకెట్ ని నోట కరుచుకొని బయటకు వచ్చింది. చిప్స్ ప్యాకెట్ కి కన్నం పెట్టేందుకు ముక్కుతో పొడవడం ప్రారంభించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీగల్ పక్షి తెలివితేటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బెస్ట్ వీడియోస్ లో ఇది కూడా ఒకటిగా చేరిపోయింది. అయితే సముద్రాల వద్ద ఉండే ఈ పక్షి ఆహారం కోసం ఇలా ఎందుకు చేసిందో చర్చనీయాంశంగా మారింది.     

 

 

Leave a Comment