ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ఏపీలో పాఠశాలలు రీఓపెన్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈనెల 12 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 ఆగస్టులోపు విద్యాసంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలిని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈనెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్స్ పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని సీఎం తెలిపారన్నారు. ఈనేపథ్యంలో ఆగస్టు 15లోపు టీచర్లకు వ్యాక్సినేషన్ వేసేందుకు కార్యచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారన్నారు. 

మరోవైపు ఇంటర్ సెకండియర్ మార్క్స్ పై కూడా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి చెప్పారు. పదో తరగతి మార్కులు 30 శాతం, ఇంటర ప్రథమ సంవత్సరం మార్కులు 70 శాతం ప్రాతిపదికగా విద్యార్థులకు సెకండియర్ మార్కులు కేటాయిస్తామని వెల్లడించారు. ఈనెలాఖరులోపు మార్స్స్ మోమోలను జారీ చేస్తామని తెలిపారు. 

 

Leave a Comment