ఆగస్టు 16న పాఠశాలలు ప్రారంభం..!

53
AP Schools Reopen

ఆగస్టు 16న పాఠశాలలు పున:ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 16న పండుగల అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. 

తొలి విడత నాడు-నేడు కింద 15 వేలకుపైగా పాఠశాలలను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. రెండో దశ కింద 16 వేల పాఠశాలల పనులను ప్రారంభిస్తామని, విద్యా కానుక కిట్లు కూడా అందించబోతున్నామని మంత్రి అన్నారు. 

ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్ టూ వరకు మంచి విద్యా వ్యవస్థను తీసుకొస్తున్నామని మంత్రి సురేష్ అన్నారు. ఆగస్టు 16న నూతన విద్యా విధానంపై సమగ్రంగా వివరిస్తామని పేర్కొన్నారు. టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేశామని మంత్రి సురేష్ వెల్లడించారు. 

Previous articleనిరుపేద కోటీశ్వరులు.. అమ్మేవి చాయ్, సమోసా.. కోట్లల్లో ఆస్తులు..!
Next articleటోక్యో ఒలింపిక్స్: హాకీలో ఇండియా బోణీ..న్యూజిలాండ్ పై విజయం..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here