Viral Video: రిపోర్టర్ గా మారిన విద్యార్థి.. దెబ్బకు ఇద్దరు టీచర్లు సస్పెండ్..!

ఓ పాఠశాల దుస్థితిపై ఓ బాలుడు చేసిన రిపోర్టింగ్ వీడియో వైరల్ గా మారింది. జార్ఖండ్ గొడ్డాలోని మహ్గమా బ్లాక్ లోని ప్రాథమిక పాఠశాలలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.. మౌలిక వసతులు సరిగ్గా లేవు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు ఆ పాఠశాలకు ఉపాధ్యాయులు కూడా సరిగ్గా హాజరు కావడం లేదు. దీంతో 12 ఏళ్ల సర్ఫరాజ్ అనే విద్యార్థి ఓ వినూత్న ఆలోచన చేశాడు.. తన పాఠశాల దుస్థితిని అందరికీ చూపించాలనుకున్నాడు. 

 

అందుకోసం ఓ టీవీ రోపోర్టర్ గా అవతారమెత్తాడు. ఓ కర్రకు ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ తగిలించి మైక్ మాదిరిగా చేశాడు. పాఠశాలలో తిరుగుతూ అక్కడి పరిస్థితిని వివరించాడు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..అది కాస్త వైరల అయ్యి ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. విధుల్లో నిర్లక్ష్యం చేయడంతో ఇద్దరు ఉపాధ్యాయులను అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో పాటు పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఆదేశించారు. దీంతో ఈ చిన్నోడిపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.   

 

 

 

Leave a Comment