Cute Video: ‘చీరలో నువ్వు చాలా బాగుంటావు’.. మేడంతో మనసులోని మాట చెప్పేసిన పిల్లవాడు..!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులోనూ చిన్న పిల్లల చెప్పే మాటలు ఎంతో ముద్దొస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ టీచర్  పిల్లవాడికి తన గురించి ప్రశ్నలు అడగడం, దానికి ఆ పిల్లవాడు అమాయకంగా సమాధానాలు చెప్పడం నవ్వులు తెప్పిస్తున్నాయి.

ఈ వీడియోలో క్లాస్ రూమ్ లో పిల్లవాడు స్కూల్ యూనిఫారంలో ఉన్నాడు. అతడు తన మేడంతో మాట్లాడుతున్నాడు. మీరు చీర కట్టుకుని వచ్చినప్పుడు చాలా అందంగా ఉంటారు మేడమ్ అంటూ ఆ టీచర్ తో చెప్పాడు. అప్పుడు ఎందుకు అందంగా ఉంటాను అని ఆ టీచర్ అడుగుతుంది.. ఆ చీర చాలా బాగుంది.. అంతే కాదు మీరు నా ఫేవరెట్ మేడమ్ అని ఆ పిల్లవాడు సమాధానం చెబుతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.    

 

Leave a Comment