కస్టమర్లకు ఎస్బీఐ హెచ్చరిక..!

సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. డబ్బులు కాజేసేందుకు నేరగాళ్లు కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్బీఐ తన ఖాతాదారులకు పలు హెచ్చరికలు జారీ చేసింది. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని సూచించింది. 

అంతే కాదు..ఏదైనా వెబ్ సైట్ లాగిన్ ఓపెన్ చేసిప్పుడు యూఆర్ఎల్ https:// నుంచి ప్రారంభం అవుతుందో.. లేదో చెక్ చేసుకోవాలని తెలిపింది. యూఆర్ఎల్ ఎప్పుడు http:// అని ఉండకూడదని సూచించింది. అలాగే ఫోన్ ద్వారా బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దని పేర్కొంది.  

You might also like
Leave A Reply

Your email address will not be published.