నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. SBI లో 5 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!

SBI Recruitment 2021 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త అందించింది. వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్ లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 27 నుంచి మే 17 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5121 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో క్లర్క్ పోస్టులతో పాటు క్లరికల్ క్యాడర్ లో జూనియర్ అసోసియేట్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులకు స్థానిక భాష తెలిసి ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష జూన్ లో, మెయిన్స్ పరీక్ష జులై 31న నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు https://sbi.co.in/web/careers వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది. 

వివరాలు..

అర్హత: ఏదైనా డిగ్రీ

వయస్సు: 20-28 ఏళ్ల మధ్య వయస్సు లేదా 1993, ఏప్రిల్ 2 నుంచి 2021, ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: ఆన్ లైన్ రాత పరీక్ష.. ప్రిలిమినరీ, మెయిన్స్ అని రెండు విభాగాలుగా ఉంటుంది. 

పరీక్ష విధానం:

ప్రిలిమినరీ: మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు అన్ని ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ఒక గంట సమయం ఉంటుంది. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీకి 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీకి 35 మార్కులు కేటాయించారు. 

మెయిన్స్ : ఇందులో మొత్తం 190 ప్రశ్నలు అడుగుతారు. వాటికి 200 మార్కులు కేటాయించారు. పరీక్షను 2.40 గంటల సమయంలో పూర్తిచేయాలి. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్ నెస్ 50 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ ఇంగ్లీస్(40 ప్రశ్నలు, 40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూట్(50 ప్రశ్నలు, 50 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్(50 ప్రశ్నలు, 60 మార్కులు) నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

దరఖాస్తుకు చివరి తేదీ: మే 17,2021

ప్రిలిమినరీ పరీక్ష: జూన్ 2021

మెయిన్స్ పరీక్ష: జూలై 31, 2021

Leave a Comment