‘సేవ్ ఏపీ పోలీస్’.. ఏఆర్ కానిస్టేబుల్ నిరసన..!

పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం స్పందంచడం లేదని ఓ ఏఆర్ కానిస్టేబుల్ నిరసన చేశాడు. ‘సేవ్ ఏపీ పోలీస్’ అంటూ ప్లకార్డుతో నిరసన తెలిపాడు. అనంతపురంలోని పోలీస్ కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరుల స్థూపం వద్ద బైఠాయించిన  ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్.. ‘ఏపీ సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్, గ్రాంట్ ఎస్ఎల్ఎస్, ఏఎస్ఎల్ఎస్ అరియర్స్.. సామాజిక న్యాయం ప్లీజ్’.. అంటూ ప్లకార్డు ద్వారా నిరసన వ్యక్తం చేశాడు. 

తమకు మూడు సరెండర్‌ లీవ్స్‌, అదనపు సరెండర్‌ లీవ్స్‌కు సంబంధించిన మొత్తం రాలేదని కానిస్టేబుల్ ప్రకాశ్ అన్నారు. పోలీసులకు 14 నెలలకు సంబంధించి రవాణా భత్యం, ఆరు డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించినట్లు ఆడిట్‌లో చూపించి వాటిపై పన్ను వసూలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పోలీసులు ఈ విషయమై ఆవేదన చెందుతున్నారని కానిస్టేబుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Comment